కొనసాగుతున్న ఉరుసు
కడప కల్చరల్: ప్రముఖ సూఫీ ఆఽధ్యాత్మిక క్షేత్రమైన కడప పెద్దదర్గాలో ఉరుసు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం కూడా భక్తుల కోలాహలంతో దర్గా ప్రాంతం సందడి గా కనిపించింది. సంప్రదాయంగా ఉత్సవాలలో ప్ర త్యేక కార్యక్రమంగా దర్గాలోని ప్రధాన గురువుల మజార్ల వద్ద భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ప్రముఖుల ప్రార్థనలు
ఉత్సవాల సందర్బంగా గురువులను దర్శించుకోవాలని, ప్రధానంగా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆశీస్సులు పొందేందుకు పలువురు ప్రముఖులు విచ్చేశారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథరెడ్డి, నగర మేయర్ సురేష్‌బాబుతోపాటు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్పొరేటర్లు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా దర్గాకు చేరుకుని ప్రార్థనలు చేపట్టారు. దేశం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు నిరాడంబరంగా దర్గాకు విచ్చేసి గురువుల దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి ఉత్సవాలకు భక్తులు వస్తూనే ఉన్నారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం పీఠాధిపతి, ఇతర భక్త ప్రముఖులు గండి వాటర్ వర్క్స్ వద్దగల దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, జెండాను ప్రతిష్ఠించి అన్నదానం చేస్తారు. అలాగే రాత్రి 10 గంటలకు స్థానిక మై అల్లా దర్గా నుంచి పీఠాధిపతి నగరోత్సవం ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment