రాయచోటి అర్బన్ : షెడ్యూలు కులాల వర్గీకరణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వెంటనే బాధ్యతలు చేపట్టి సకాలంలో నివేదికలు అందచేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్యమాదిగ అన్నారు. అన్నమ య్య జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన స్థానిక ఎన్‌జీఓ సభా భవనంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీవర్గీకరణ అంశం దశాబ్దకాలంగా వివాదాలతో నలిగి కోర్టుకు చేరింద న్నారు. 2024 ఆగస్టు1న ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రప్రభుత్వాలకు ఉందని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. దీంతో కూటమి ప్రభుత్వం ఎస్సీవర్గీకరణ అమలుకు సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. కమిషన్ తనకు ప్రభుత్వం ఇచ్చిన కాలవ్యవధిలోగా ఎస్సీ జాబితాలోని 59 కులాల గణాంకాలను నిష్పక్షపాతంగా సేకరించాలంటూ కోరారు. కార్యక్రమంలో డప్పుకళాకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ నాగభూషణం, ఎంఆర్ పియస్ రాష్ట్రకార్యదర్శి ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి బి.పెంచలయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment