వన్యప్రాణులను వేటాడితే చర్యలు
సిద్దవటం : వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని కడప ప్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌ఓ రాజశేఖర్‌బాబు హెచ్చరించారు. సిద్దవటం రేంజిలోని రోళ్ళ బో డు బేస్ క్యాంప్ , గొల్లపల్లె బీటు, సాకిరేవులు, బండిగానిసెల, లంక వంటి సమస్యాత్మక ప్రాంతాలను మంగళవారం అటవీ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణ, ఎర్రచందనం పరిరక్షణపై సిబ్బందికి పలు సూచనలు ఇచ్చామన్నారు. అటవీ ప్రాంతంలోని సంపదను తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నాన్నారు. ఈ కార్యక్రమంలో ప్లైయింగ్ స్క్వాడ్ ఎఫ్‌ఆర్‌ఓ మదన్‌మోహన్‌రెడ్డి, సిద్దవటం రేంజర్ ఓబులేసు, ఎఫ్‌బీఓ విశ్వనాథ్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment