No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Wed, Nov 20 2024 1:46 AM | Last Updated on Wed, Nov 20 2024 1:46 AM

-

బుర్రలదిన్నెపల్లి

టీచర్‌ సస్పెన్షన్‌

రాయచోటి : బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బుర్రలదిన్నె పాఠశాల ఉపాధ్యాయుడు నాగమునినాయక్‌ను డీఈఓ కె.సుబ్రమణ్యం సస్పెండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు నాగమునినాయక్‌ను సస్పెండ్‌ చేసినట్లు డీఈఓ మంగళవారం పత్రికలకు అందజేసిన ప్రకటనలో పేర్కొన్నారు. టి.సుండుపల్లి మండలం బుర్రలదిన్నె పాఠశాలలో ఎస్‌జీటీగా పని చేస్తున్న నాయక్‌ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. దీంతో ఉపాధ్యాయుడిపైన విచారణ చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చామన్నారు. కలెక్టర్‌ ఆదేశాలతో టీచర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు ఇచ్చామని వివరించారు.

ఫారెస్టు అధికారుల

వేధింపులు ఆపాలి

రాయచోటి అర్బన్‌ : ఫారెస్టు అధికారుల వేధింపుల నుండి దళితుడైన పెద్ద గంగయ్యకు రక్షణ కల్పించాలని దళితహక్కుల పోరాట సమితి (డిహెచ్‌పియస్‌) జిల్లా ప్రధాన కార్యదర్శి మండెం సుధీర్‌కుమార్‌ డీఆర్‌ఓ మధుసూదన్‌రావుకు విన్నవించారు. డిహెచ్‌పియస్‌ నేతలు మంగళవారం డీఆర్‌ఓ మధుసూదన్‌రావును కలెక్టరేట్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి ఫారెస్టు అధికారుల పనితీరుపై ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేశాపురం దళితవాడకు చెందిన పెద్దగంగయ్య గత 30 సంవత్సరాలుగా ఫారెస్టు భూమికి సమీపంలోని రెండున్నర ఎకరాల భూమిని చదును చేసుకుని వర్షాధారంగా పంటలు సాగుచేసుకుంటున్నాడన్నారు. కాగా పారెస్టుగార్డు రత్నమ్మ భూమిసాగు విషయంలో గంగయ్యపై బెదిరింపులకు పాల్పడడం, సాగుచేసిన పంటలను దున్నేయడం ద్వారా నష్టపరిచేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు గంగయ్య భూమిపై విచారించగా గంగయ్య భూమితో పాటు పక్కనే ఉన్న ఉన్నత కులాలకు చెందిన మలసాని రాధమ్మ, వసంతల ఆఽధీనంలోని 10 ఎకరాల మామిడితోట కూడా ఆక్రమణలో ఉందంటూ తేల్చారన్నా రు. కాగా ఫారెస్టుగార్డు రత్నమ్మ మామిడి తోటను సాగుచేస్తున్న ఉన్నత కులాల వారిని ఏమీ అనకపోగా, దళితుడైన గంగులయ్యను పంట సాగు చేయకుండా అడ్డుకోవడంతో పాటు వేధింపులకు గురిచేస్తోందంటూ ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో డిహెచ్‌పియస్‌ నేత పండరయ్య, బాధితుడు గంగులయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement