మదనపల్లెలో వైరెటీ దొంగతనాలు
మదనపల్లె : పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో వైరెటీ దొంగతనాలు జరిగాయి. ఇళ్లలోని విలువైన వస్తువులను దొంగలించకుండా, కేవలం ఇంటి తలుపులకు ఉన్న విలువైన లాక్‌లను చోరీ చేసుకుని వెళ్లడం జరిగింది. టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్‌బీఐ కాలనీలో ఉన్న స్థానికులు సోమవారం రాత్రి ఎప్పటిలానే తలుపులకు గడియలు వేసుకుని లోపల నిద్రించారు. అయితే మంగళవారం తెల్లవారుజామున 2గంటల సమయంలో ఓ ఇంటి ముందు తలుపు తాళం తీస్తున్నట్లు శబ్దం రావడంతో ఆ ఇంట్లోని వ్యక్తులు మేల్కొని గమనిస్తే.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు చోరీచేసి పారిపోవడం చూశారు. వెంటనే బయటకు వచ్చి స్థానికులను అప్రమత్తం చేశారు. అప్పటికే దొంగలు ఏడు ఇళ్లలో ఇంటి డోర్‌కు ఉన్న బ్రాస్ మెటల్‌తో తయారుచేసిన విలువైన డోర్‌లాక్‌లు, హ్యాండిల్స్ చోరీ చేశారు. మార్కెట్‌లో వీటి విలువ ఒకొక్కటి రూ.7వేల వరకు ఉంటుందని ఇంటి యజమానులు తెలిపారు. చోరీ విషయాన్ని టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని చూశారు. దొంగలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇదేవిధంగా ఇటీవల పట్టణంలోని సొసైటీకాలనీలోనూ చోరీలు జరిగినట్లు సమాచారం.
విలువైన డోర్‌లాక్‌లు చోరీ
Comments
Please login to add a commentAdd a comment