డీజిల్ కొరతతో ఆగిన ఆర్టీసీ బస్సు
చిన్నమండెం : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సొంత ఇలాఖాలో డీజిల్ కొరతతో ఆర్టీసీ బస్సు నిలిచిపోగా.. రెండు గంటల పాటు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడిన సంఘటన చిన్నమండెం మండలంలో చోటు చేసుకుంది. ప్రయాణీకుల కథనం మేరకు.. మదనపల్లె డిపోకు చెంది రాయచోటి నుండి మదనపల్లెకు ఏపీ03 టీఈ 2609 నెంబర్ గల బస్సు బయలుదేరింది. రాయచోటి నుండి మదనపల్లెకు వెళ్తుండగా చిన్నమండెం మండలం దిన్నెమీదపల్లె క్రాస్ వద్దకు రాగానే డీజిల్ కొరతతో ఆగిపోయింది. ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి డీజిల్ తెచ్చి వేసినా బస్సు స్టార్ట్ కాలేదు. దీంతో ప్రయాణీకులు రెండు గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర పనుల నిమిత్తం కొంత మంది ఉండగా మరికొందరు ఆసుప్రతులకు.. పలు పనుల నిమిత్తం వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం స్పందించిన ఆర్టీసీ అధికారులు ఇతర ఆర్టీసీ బస్సులలో ప్రయాణీకులను అనుమతించడం జరిగింది. కండీషన్ ఉన్న బస్సులు నడపాలని ప్రజలు కోరుతున్నారు.
రెండు గంటల పాటు ఇబ్బందులు పడిన ప్రయాణికులు
Comments
Please login to add a commentAdd a comment