No Headline
సాక్షి రాయచోటి/ఓబులవారిపల్లె : కూటమి ప్రభుత్వం చిరుద్యోగుల మెడపై కత్తి కడుతోంది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి.. చిన్నపాటి ఉద్యోగాలను చేసుకుంటున్న వారిపై పంజా విసురుతోంది. ఏపీఎండీసీలో చిరుద్యోగులను ప్రభుత్వం తొలగించడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మేమెలా బతకాలి అంటూ తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
ఏపీఎండీసీలో ఔట్ సోర్సింగ్
ఉద్యోగుల తొలగింపు..
ఆంధ్రప్రదేశ్ మైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) విభాగంలో పనిచేస్తున్న సుమారు 123 మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం తాజాగా ఉద్వాసన పలికింది. అన్నీ సక్రమంగా ఉన్నా కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పలువురిని ఈ సర్కార్ తొలగించింది. గతంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్నమయ్య జిల్లా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్సార్ జిల్లా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సిఫార్సులు చేశారని సాకులు చూపుతూ మైనింగ్ డిపార్టుమెంట్‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను తాజాగా తొలగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినా, అన్నమయ్య జిల్లాలోని మంగంపేట ప్రాజెక్టులో పనిచేస్తున్న తొమ్మిది మందితోపాటు మొత్తం రాష్ట్రంలో పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది చిత్తూరు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. వారంతా ఆవేదన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment