వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత కటారు సుబ్బరామిరెడ్డి మృతి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత కటారు సుబ్బరామిరెడ్డి మృతి

Published Sat, Nov 23 2024 12:35 AM | Last Updated on Sat, Nov 23 2024 12:35 AM

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత కటారు సుబ్బరామిరెడ్డి మృతి

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత కటారు సుబ్బరామిరెడ్డి మృతి

రాజంపేట : రాజంపేట పట్టణ వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ప్రముఖ న్యాయవాది, సింగల్‌విండో మాజీ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్‌ కటారు సుబ్బరామిరెడ్డి (70) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తుదిశాస్వ వదిలారు. ఆయన అంత్యక్రియలు శనివారం 10.35 గంటలకు నిర్వహించనున్నట్లు ఆయన సోదరుడు కటారుశేఖర్‌రెడ్డి తెలిపారు. కటారు మృతి పట్ల ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మేడా రఘునాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మున్సిపాలిటి చైర్మన్‌ పోలా శ్రీనువాసులరెడ్డి, మార్కెట్‌కమిటీ మాజీచైర్మన్‌ పీసీయోగీశ్వరరెడ్డి, పట్టణ వైఎస్సార్‌సీపీ కన్వీనరు కృష్ణారావుయాదవ్‌, మున్సిపాలిటి కో–ఆప్షన్‌సభ్యుడు రాముయాదవ్‌, కౌన్సిలర్‌ కూండ్లరమణారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

మామను చంపిన అల్లుడికి జీవిత ఖైదు

మదనపల్లె : తండ్రి మరణానికి కారకుడనే నెపంతో మామను హత్యచేసిన అల్లుడికి ఏడేళ్ల విచారణ అనంతరం మదనపల్లె రెండో అడిషనల్‌ జిల్లాకోర్టు జీవితఖైదు శిక్షను ఖరారుచేస్తూ జడ్జి అబ్రహాం తీర్పునిచ్చారు. చిత్తూరు జిల్లా సోమల మండలం నెల్లిమంద గొల్లపల్లెకు చెందిన వెంకటసిద్ధులు (63)ను 2017 ఆగస్ట్‌ 7వ తేదీన కలికిరి మండలం గుట్టపాళ్యం గొల్లపల్లె పొలాల వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. తండ్రి హత్యపై వెంకటసిద్ధులు కుమారుడు నాగరాజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అప్పి సోమల ఎస్‌ఐ లక్ష్మీనారాయణ అప్పట్లో కేసు నమోదు చేశారు. విచారణ బాధ్యతను అప్పటి చౌడేపల్లె సీఐ రవీంద్రకు అప్పగించారు. పోలీసు విచారణలో వెంకటసిద్ధులు అల్లుడు పి.సుధాకర (45)ను నిందితుడిగా గుర్తించారు. పోలీసు విచారణలో అల్లుడు మామను హత్యచేసినట్లుగా నిర్ధారణ కావడంతో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. ఏడు సంవత్సరాల పాటు కేసు విచారణ మదనపల్లె రెండో అదనపు జిల్లా కోర్టులో జరిగింది. శుక్రవారం జిల్లా కోర్టు జడ్జి అబ్రహాం నిందితుడిపై నేరం రుజువు కావడంతో జీవితఖైదు శిక్షతో పాటు రూ.3వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సీఐ రవీంద్ర, ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, చౌడేపల్లె సీఐ రాంభూపాల్‌, సోమల ఎస్‌ఐ శివశంకర్‌, కోర్టు కానిస్టేబుల్‌ సునీల్‌కుమార్‌, కోర్ట్‌ మానిటరింగ్‌ సెల్‌ సిబ్బందిని చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్‌.మణికంఠ చందోలు అభినందించారు.

వీఆర్‌ఏను దూషించిన

భూ ఆక్రమణ దారుడు

ఒంటిమిట్ట : మండల పరిధిలోని ఇబ్రహీంపేటకు చెందిన సుధాకర్‌ అనే భూ ఆక్రమణ దారుడు తనను దూషించాడని పెన్నపేరూరు వీఆర్‌ఏ శాంత ఒంటిమిట్ట తహసీల్దార్‌ రమణమ్మకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి వివరాల మేరకు.. మండల పరిధిలోని ఓబులేశు కోన సమీపాన సర్వే నెంబరు. 661లో ఉన్న ప్రభుత్వ భూమిని ఇబ్రహీమ్‌ పేటకు చెందిన సుధాకర్‌ అనే వ్యక్తి అక్రమంగా చదును చేస్తున్నారన్న సమాచారం రావడంతో అడ్డగించేందుకు గంగపేరూరు వీఆర్‌ఏతో కలిసి వెళ్లినట్లు తెలిపింది. అంతలోనే సమాచారం అందుకున్న సుధాకర్‌ చదును చేస్తున్న ట్రాక్టర్‌తో సహా వెనుతిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. సుధాకర్‌ ఇంటికి వెళ్లి ఎవరూలేని సమయంలో ఇలా అక్రమంగా భూమిని చదును చేయడం చట్టపరంగా నేరమని చెప్పడంతో నోటికొచ్చినట్లు దూషించారని తెలిపింది. వీఆర్‌ఏ ఫిర్యాదును స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు రెఫర్‌ చేయనున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు.

రైతులకు బిందు,

తుంపర సేద్య పరికరాలు

– జిల్లా సూక్ష్మ నీటి సాగు అధికారి

లక్ష్మిప్రసన్న

రాజంపేట రూరల్‌ : జిల్లాలో అవసరమైన వ్యవసాయ రైతులకు బిందు, తుంపర సేద్య పరికరాలను అందించనున్నట్లు జిల్లా సూక్ష్మ నీటి సాగు అధికారి వై లక్ష్మిప్రసన్న తెలిపారు. మండల పరిదిలోని ఆకేపాడు రైతు సేవా కేంద్రంలో శుక్రవారం డివిజన్‌ రైతు సేవా కేంద్ర సిబ్బందికి, ఎంఐ కంపెనీ సిబ్బందికి బిందు, తుంపర సేద్య పరికరాల రిజిస్ట్రేషన్‌, ప్రాథమిక సర్వేలపై, పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వై.లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ బిందు, తుంపర సేద్య పరికరాలు కావాల్సిన రైతులు సమీప రైతు సేవా కేంద్రంలో రిజిఏస్టేషన్‌ చేసుకోవాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో రాజంపేట ఉద్యాన ఆధికారి జీ సురేష్‌బాబు, ఎంఐడీసీ చంద్ర, ఎంఐ ఇంజనీర్‌ గురుప్రసాద్‌, ఎంఐఏఓ నజీర్‌, రాజంపేట, నందలూరు,పెనగలూరు రైతు సేవా కేంద్రాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement