తంబళ్లపల్లె : భూమి ఆన్‌లైన్, వన్‌బీ, పట్టాదారు పాస్‌బుక్ మంజూరు చేశారని గతంలో పని చేసిన తహసీల్దార్, వీఆర్‌ఓపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి కథనం మేరకు ...గోపిదిన్నె పంచాయతీ జల్లావారిపల్లెకు చెందిన కె.మల్‌రెడ్డి టీఎన్ శ్యామలమ్మ వద్ద 606 సర్వే నంబర్‌లో 75 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. మల్‌రెడ్డి 2014లో మృతి చెందాడు. ఆ భూమిని గతంలో పని చేసిన తహసీల్దార్ సి.కె.శ్రీనివాసులు అప్పటి గోపిదిన్నె వీఆర్‌ఓ విశ్వంభర్‌నాయుడు ఆ భూమిలోని సబ్‌డివిజన్ చేసి 606/జె 1 సర్వే నంబర్‌తో అదే గ్రామంలోని బంధువైన వి.శివారెడ్డి పేరుతో ఆన్‌లైన్ చేసి వన్‌బీ, పట్టాదారు పాస్‌బుక్ మంజూరు చేశారని మల్‌రెడ్డి కుమారుడు రెడ్డిశేఖర్‌రెడ్డి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు దీనిపై విచారించాలని పోలీసులకు ఉత్వర్వులు ఇచ్చింది. మల్‌రెడ్డి కుటుంబీకుల అనుమతి లేకుండా తహసీల్దార్, వీఆర్‌ఓ ఏకపక్ష నిర్ణయాలతో వన్‌బీ, పాసుబుక్ మంజూరు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ ఫిర్యాదు మేరకు ఈనెల 5న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment