నిరుద్యోగ యువతకు శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్: కిడ్స్ ట్రస్టు ఆధ్వర్యంలో విజయవాడలో ట్యాలీ ప్రైమ్, జీఎస్టీ అడ్వాన్స్, ఎకై ్సల్ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారని ఉన్నతి ఫౌండేషన్ అడ్మిషన్స్ కో ఆర్డినేటర్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. బీకాం, ఎంకాం ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ యువకులు 20–30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఇందుకు అర్హులన్నారు. విజయవాడలో 45 రోజులపాటు ఉచిత శిక్షణ ఇచ్చి అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు.ఇతర వివరాలకు 90004 87423 నంబరులో సంప్రదించాలన్నారు.
రాయలసీమలోని సంస్థలను అమరావతికి తరలించరాదు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: రాయలసీమలో ఉన్న సంస్థలను అమరావతికి తరలించరాదని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (ఆర్‌సీపీ) రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడపలోని ఆర్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మట్లాడుతూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి, లోకయుక్త, మానవ హక్కుల కమిషన్, ఇక్కడే ఉంచిన విధంగా ఏపీజీబీ, ఇతర సంస్థలను రాజధాని అమరావతికి తరలించటం లేదని చెప్పాలన్నారు. కార్యక్రమంలో, ఆర్‌సీపీ నగర కార్యదర్శి, మగ్బుల్‌బాషా, మడగలం ప్రసాద్, పాల్గొన్నారు.
యాంత్రిక జీవన శైలితోనే ప్రమాదకర వ్యాధులు
కలకడ: యాంత్రిక జీవన శైలితోనే ప్రమాదకర వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ కొండయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని ఎర్రకోటపల్లె పీహెచ్‌సీ పరిధిలోని ఎగువబట్టావారిపల్లె, బొజ్జగుంటపల్లె లో నిర్వహిస్తున్న ఎన్‌సిడి 3.0 (అసంక్రమిత వ్యాధులు)సర్వేని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అసంక్రమిత వ్యాధులు అయిన క్యాన్సర్, షుగర్, బీపీ, థైరాయిడ్, గుండెజబ్బులు, ఊబకాయం వంటి జబ్బులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయని వీటికి ముఖ్యకారణం మారుతున్న జీవనశైలి, యాంత్రిక జీవనానికి అలవాటుపడటం అని అన్నారు. సీహెచ్‌ఓలు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. దోమల నివారణకు చర్య లు తీసుకోవాలని, డెంగ్యూ జ్వరాల వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ రామక్రిష్ణ, ఎంపీహెచ్‌ఓ జయరామయ్య, సిబ్బంది రాజసులోచన, వరలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment