●కనిపించని చిరునామా
రాయచోటి: కూటమి ప్రభుత్వంలో సాఫీగా జరిగి పోతుందనుకున్న విద్యాశాఖకు నేడు పెద్ద చిక్కు సమస్య వచ్చి పడింది. సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమానికి అనుకున్న స్థాయిలో స్పందన లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి విద్యార్థుల రోజువారీ హాజరును ఆన్‌లైన్‌లో ఉన్నతాధికారులకు పంపుతారు. వరుసగా 29 రోజులు బడికి రాని పిల్లల పేర్లు డ్రాప్‌బాక్స్‌లో చేరతాయి. తిరిగి వారు హాజరైతే డ్రాప్‌బాక్స్ నుంచి తొలగిస్తారు. యూడైస్‌లో పేర్లు నమోదైనప్పటికీ, కొందరు పిల్లలు బడికి రావడం లేదన్న సమాచారం ఉంది.
● నూతన ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇస్తామన్న తల్లికి వందనం నిధులు చెల్లించకపోవడంతో డ్రాప్‌బాక్స్‌లో వారి సంఖ్య మరింత పెరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీరి లో ఎక్కువగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు బడికి రాకుండా కుటుంబ సభ్యులకు తోడుగా ఉపాధి వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. దాంతో వారి పేర్లు అలాగే డ్రాప్‌బాక్స్‌లో కనిపిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ లెక్కలు తీయగా అన్నమయ్య జిల్లా అందులో 6 వ స్థానంలో ఉన్నట్లు ప్ర కటించింది. తాజా సమాచారం ప్రకారం జిల్లా వ్యా ప్తంగా డ్రాప్‌బాక్స్‌లో ఉన్న వారి సంఖ్య 5,072 గా ఉంది. దీంతో వీరి వివరాలు గుర్తించి బడిలో చేర్పించేలా చూడాలని ఉన్నతాధికారులు దిగువ స్థాయి అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల కోసం చేస్తున్న అన్వేషణకు ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తలపెట్టిన అపార్ కార్యక్రమంతో మరింత ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా అపార్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల మేరకు జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులు, ఇతర శాఖల అధికారులను ఆదేశించడంతో అన్వేషణ ఆలస్యం అవుతున్నట్లు తెలియవచ్చింది.
నమోదులోనూ తప్పులు: జిల్లాలో గత నెల రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఏ రోజు సమాచారాన్ని ఆ రోజు డైరెక్టర్ కార్యాలయానికి అధికారులు పంపుతున్నారు. సహేతుకమైన కారణాలు ఉంటే ఆయా పిల్లల పేర్లు రాష్ట్ర కార్యాలయంలోనే డ్రాప్‌బాక్స్ నుంచి తొలగిస్తున్నారు. ఇలా బుధవారం నాటి కి 4వేల మంది విద్యార్థుల లెక్కలను తేల్చగా మరో వెయ్యి మందికి పైగా విద్యార్థుల లెక్క తేల నట్లు సమాచారం ఉంది. సాధ్యమైనంత వరకు మిగిలిన వారి వివరాలను కూడా మరో రెండు, మూడు రోజు ల్లో తేల్చాలని ఉన్నతాధికారులు బృందం సభ్యులకు సూచిస్తున్నారు. ఈ పేర్లలో కొన్ని డబుల్ ఎంట్రీలున్న ట్లు గుర్తించారు. విద్యార్థి బడిలో చేరినప్పుడు ఆధార్ కార్డు లేకపోతే తొమ్మిది అంకెలు 12 వేసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. సొంత ఆధార్ నంబర్ వచ్చాక ఆ సంఖ్యతో మళ్లీ నమోదు చేయనున్నారు. ఈ సమయంలో దొర్లిన పొరపాట్లతో రెండు సంఖ్యలపై ఒకే పేరు ఉన్నట్లు బృందం సభ్యులు గుర్తిస్తున్నారు.
బృందాలతో సేకరణ...
డ్రాప్‌బాక్స్‌లో ఉన్న విద్యార్థులు ప్రస్తుతం ఎక్కడున్నారు..? వేరే పాఠశాలలలో, కళాశాలలలో ఏమైనా చదువుతున్నారా..? లేదంటే వలస వెళ్లారా..? ఇంకా ఏదేని సమస్యలున్నాయా.? అన్న విషయాలను పూర్తిగా క్రోడీకరించి పంపాలని కోరారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న సీఆర్పీలు, వెల్ఫేర్ సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి సేకరణ చేపట్టారు. ఈ సేకరణ సమయం దగ్గరపడుతున్నా పూర్తిస్థాయిలో డ్రాప్‌బాక్స్‌లో ఉన్న వారి లెక్కలు కొలిక్కి రాలేదన్న సమాచారం.
జిల్లాలో 414 మంది సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు, 142 మంది క్లస్టర్ రిసోర్స్ (సిఆర్పీ) పర్సన్లకు ఈ బాధ్యత అప్పగించారు. వారు ఇచ్చే సమాచారంతో పాటు తమ వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఆ పరిధిలోని పాఠశాల హెచ్‌ఎంల ద్వారా సమగ్ర శిక్షా కార్యాలయానికి 15 రోజుల్లో వివరాలు పంపాల్సి ఉంది. తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ కూడా సేకరించాలని రాష్ట్ర విద్యాశాఖ డైరక్టర్ ఇటీవల అందరు డీఈవోలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. గడువు సమయం దగ్గర పడుతున్నా పూర్తిస్థాయిలో విద్యార్థుల సమాచారం అందడం లేదని బృందం సభ్యులు చెబుతున్నారు.
జిల్లాలో 5,072 మంది బడికి రాని పిల్లలు
వెల్ఫేర్ అసిస్టెంట్లు, సీఆర్పీలకు అన్వేషణ బాధ్యతలు
గడువు ముగుస్తున్నా తేలని విద్యార్థుల లెక్కలు
అపార్‌తో మరింత ఆలస్యం అవుతున్న అన్వేషణ
దాదాపు పదేళ్లుగా కొందరు విద్యార్థుల పేర్లు డ్రాప్‌బాక్స్‌లో కొనసాగుతున్నా వారి అడ్రస్సుల సేకరణలో అధికారుల శ్రమకు ఫలితం కని పించడం లేదన్న విమర్శలు ఉన్నా యి. వీరిలో కొందరికి వివాహాలు కావడం, మరికొందరు ఇతర రాష్ట్రాలకు వలసపై వెళ్లడం, ఇంకొద్ది మంది మృతి చెందడం వంటి కారణాలు ఉన్నట్లు సమాచారం వస్తోందని పేర్కొంటున్నారు. ఎవ రైనా బడిఈడు పిల్లలు బడి బయట ఉంటే వారిని వెంటనే బడిలో చేర్చాలని అధికారులు ఆదేశాలి స్తున్నారు. అయినా ఇప్పటి వరకు ఎవరినీ తిరిగి చేర్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు వారిని వెతికి పట్టుకున్నా బడికి రారని, ఆర్థిక, కుటుంబ సమస్యల వల్ల వారు చదువు మానేసినట్లు కొందరు హెచ్‌ఎంలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డ్రాప్‌బాక్స్‌లో ఉన్న వారిలో ఎక్కువ మంది 8 నుంచి 12 తరగతులలో చదువులు మానేసిన వారే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment