లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వద్దు
సుండుపల్లె: ప్రభుత్వం వివిధ పథకాలలో నిర్దేశించిన లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వద్దని, చట్టప్రకారం పీజీఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించా రు. శుక్రవారం సుండుపల్లి ఎంపీడీఓ కార్యాల యాలలో సీఎంఓ, పీజీఆర్‌ఎస్ దరఖాస్తులు, విద్యార్థులకు అపార్ ఐడీ జనరేషన్, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్, ఇళ్ల నిర్మాణ ప్రగతి, ఎన్‌సీపీఐలో బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ తదితర అంశాలలో తహశీల్దార్లు, ఎంపీడీఓలు, డీటీలు, వీఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఏపీఎంలు, ఇతర అధికారుల తో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం టి సుండుపల్లిలోని ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించి అక్కడి పిల్లలకు భోజనం వడ్డించారు. అంగన్ వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
వీరబల్ల్లి: ప్రజలు గ్రీవెన్స్‌లో అందజేసిన దరఖాస్తులపైన విచారించి నిష్పక్షపాతంగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం ఆయన వీరబల్లి మండలాన్ని సందర్శించి అన్నిశాఖల అధికారులతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
సమస్యల పరిష్కారానికి కృషి
రాయచోటి : రాయచోటి కలెక్టరేట్‌లోని వీడి యో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం రాజంపేట, మదనపల్లె సబ్ కలెక్టర్లు, జిల్లాలోని తహసీ ల్దార్లతో పీజీఆర్‌ఎస్ ద్వారా అందిన అర్జీలు, సీఎం కార్యాలయం నుంచి వచ్చిన అర్జీలు తదితర అంశాలపై కలెక్టర్ శ్రీధర్ సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారుల కు భూసేకరణ, ఈ ఆఫీస్ అమలు అంశాలపై తగు సూచనలు చేశారు. జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్, రాజంపేట సబ్ కలెక్టర్ నైదియాదేవి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment