రాయచోటి (జగదాంబసెంటర్) : పాఠశాలల్లో పనివేళలు పెంచడం శాసీ్త్రయ విధానానికి, మనో విశ్లేషణ సిద్ధాంతానికి వ్యతిరేకమని ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పిసి రెడ్డన్న అన్నారు. జిల్లా కేంద్రం రాయచోటిలో ఏర్పాటు చేసిన సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. పాఠశాలల సమయాన్ని మార్చాలనుకున్పుడు మానసిక నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని, ఇతర రాష్ట్రాలలో ఏ విధంగా పాఠశాలల బోధన సమయాలు ఉన్నాయో పరిశీలించాలన్నారు. దక్షిణాది రాష్ట్రాలలోనే కాకుండా దేశంలో అగ్రస్థానంలో ఉన్న కేరళలో ఉదయం 9–10 నిమిషాల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కొన్ని పాఠశాలలు, 10 గంటల నుంచి 4 గంటల వరకు, ఉన్నత పాఠశాలలో 7.30 గంటల నుంచి 1.30 గంటల వరకు నిర్వహిస్తున్నారన్నారు. విరామ సమయాన్ని తీస్తే అన్ని పాఠశాలల గరిష్ట పనివేళలు ఐదు గంటలు మాత్రమే అన్నారు. తమిళనాడులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు నిర్వహిస్తున్నారని, కర్ణాటక రాష్ట్రంలో 8 గంటల నుంచి 1.30 గంటల వరకు పాఠశాలలు నిర్వహిస్తున్నారన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 9.30 గంటల నుంచి 3.30 గంటల వరకు పాఠశాలలు నిర్వహిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పనివేళలు పెంచడానికి గల కారణం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం
రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పీసీ రెడ్డన్న
Comments
Please login to add a commentAdd a comment