నలుగురు కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
పెద్దతిప్పసముద్రం : విధుల్లో అలసత్వం వహిస్తున్న నలుగురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు మదనపల్లి డీఎల్‌పీఓ కే.నాగరాజు తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని పలు గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్వచ్ఛ గ్రామ పంచాయతీల డిజిటలైజేషన్ విషయంలో సచివాలయ సిబ్బందికి పంచాయతీరాజ్ కమిషనర్ సమగ్రంగా ఆదేశాలు ఇచ్చినా కూడా కొంత మంది సిబ్బంది నిర్లక్ష్యంగా వహిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో బి.కొత్తకోట మండలంలోని గట్టు, వేమిలేటికోట, గుమ్మసముద్రం, నాయనబావి పంచాయతీల కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. మదనపల్లి డివిజన్ పరిధిలోని 251 గ్రామ పంచాయతీల పరిధిలో 1.88,464 గృహాలు డిజిటలైజేషన్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 17,523 గృహాలను మాత్రమే పూర్తి చేశారన్నారు. సిబ్బంది సేకరించిన ప్రాథమిక సమాచారాన్ని ఈ నెలాఖరులోగా స్వచ్ఛ గ్రామ పంచాయతీ పోర్టల్‌లో సమగ్రమైన వివరాలను అప్‌లోడ్ చేసేలా ఆదేశాలిచ్చామన్నారు. సచివాలయాల్లో నగదు రహిత లావాదేవీలను నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సిబ్బంది కొరత ఉన్న గ్రామాల్లో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రభుత్వ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టామన్నారు. పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజల సూచనల మేరకు రంగసముద్రం చేపల చెరువుకు వేలం నిర్వహిస్తామని డీఎల్‌పీవో వెళ్లడించారు. ఆయన వెంట ఎంపీడీఓ అబ్దుల్ కలాం ఆజాద్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
నెలాఖరులోగా
డిజిటలైజేషన్ పూర్తి చేయాలి
డీఎల్‌పీఓ కే.నాగరాజు
Comments
Please login to add a commentAdd a comment