పచ్చని పల్లెల్లో రెడ్‌బుక్ విష సంస్కృతి
మదనపల్లె : ప్రశాంతతకు మారుపేరైన పచ్చని పల్లెల్లో కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్‌బుక్ పేరుతో విష సంస్కృతిని వ్యాపింపచేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని నియోజకవర్గ సమన్వయకర్త నిసార్‌అహ్మద్ అన్నారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడి, మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంకిశెట్టిపల్లెకు చెందిన గంగులమ్మ, బాలకృష్ణలను శుక్రవారం ఆయన పరామర్శించారు. దాడికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానని, భయపడాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు. అకారణంగా దాడికి పాల్పడి వైఎస్సార్ సీపీ నాయకులను గాయపరిచిన వారిపై కేసులు నమోదుచేసి అరెస్ట్‌చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...టీడీపీ ప్రభుత్వ పాలనలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు అధికమయ్యాయన్నారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదన్న వాస్తవాన్ని టీడీపీ నాయకులు గ్రహించాలన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ఎవరికి ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందన్నారు.
వైఎస్సార్ సీపీ కార్యకర్తలు,
సానుభూతిపరులపై దాడులు
ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నిసార్‌అహ్మద్
Comments
Please login to add a commentAdd a comment