కడప రూరల్: రాష్ట్ర మాలమహానాడు రామాజీ ఇమ్మానియేల్ వర్గం రాయలసీమ మహిళా అధ్యక్షురాలిగా బండి నీతును నూతనంగా నియమించారు. కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపాక వినోద్‌కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కాలంలో తమ వర్గం గ్రామ, మండల, జిల్లా స్థాయిలో మరింత చురుగ్గా పనిచేసేందుకు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినయ్ సాగర్, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఉల్లి కిరణ్, రాయలసీమ అధ్యక్షుడు మేకల ఓబులేసు, రాయలసీమ సోషల్ మీడియా అధ్యక్షుడు సీకే కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment