విండ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
రామాపురం: రామాపురం–వీరబల్లి మండలాల సరిహద్దులోని వంగిమళ్ల సమీపంలో ఏర్పాటు చేయనున్న విండ్ ప్రాజెక్టు (గాలి మరల విద్యుత్ ప్లాంట్) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. వీరబల్లి మండలం వంగిమళ్ల సమీపంలో 1800 మెగావాట్ల సామర్థ్యంతో ఈ గాలి మరల విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం గత ప్రభుత్వంలో 490 ఎకరాల భూమిని సేకరించారు. అదనంగా 190 ఎకరాలు భూమి అవసరమంటూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విండ్‌పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసే భూమి వరకు నాలుగు లైన్ల రోడ్డు వేసేందుకు కడప – రాయచోటి ప్రధాన రహదారి గువ్వలచెరువు నుంచి వంగిమళ్ల వరకు కొండ కింది భాగంలో రోడ్డు వేసేందుకు సర్వే కూడా పూర్తయింది. ఇందుకు అవసరమైన భూమి సేకరణ కూడా పూర్తి చేసినట్లు తెలిసింది. 1800 మెగావాట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 676 ఎకరాలు కావాల్సి ఉంటుందని, ఆ సంస్థ ఎండీ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమి ఇతర సదుపాయాలు అన్ని సమకూర్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment