సెంటు ఎల్లో చామంతులు.... అదేనండీ మన నాటి చామంతులు పిల్ల
గుర్రంకొండ: సెంట్‌ఎల్లో చామంతి (నాటి చామంతి) సిరులు కురిపిస్తోంది. ఈ రకం పూల సాగుతో నిలకడైన ఆదాయం వస్తుండడంతో రైతులు వీటి సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కొత్తరకం చామంతులు సాగు చేసిన రైతులు లాభాలు కళ్లజూస్తున్నారు.
కర్ణాటక నుంచి దిగుమతి: ప్రస్తుతం ఈ రకం పూల నారు మన రాష్ట్రంలోని నర్సరీల్లో లభించడం లేదు. దీంతో జిల్లా రైతులు కర్ణాటక రాష్ట్రం నుంచి నారుమొక్కలను దిగుమతి చేసుకొంటున్నారు. సాధారణంగా ఇక్కడి నర్సరీల్లో రూ. 1 నుంచి రూ. 2 వరకు మొక్కల ధరలు ఉంటాయి. ప్రస్తుతం వీటికి డిమాండ్ ఉండడంతో రైతులు బయట రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొంటుండడం విశేషం.
బరువు ఎక్కువ ...
సాధారణ చామంతి పూలతో పోల్చితే ఈ రకం పూలు బరువు ఎక్కువ. సాధారణ చామంతి పూల రేకుల్లా కాకుండా సెంట్ ఎల్లో చామంతి రేకుల బరువు వైవిధ్యంగా ఉంటుంది. తొందరగా రేకులు రాలిపోవు, రబ్బరు లాగా పువ్వుకే అతుక్కొని ఉంటాయి. పైగా ఇవి సాధారణ చామంతి పూల కంటే ఎక్కువ రోజులు వాడిపోకుండా సువాసన ఇవ్వగలిగిన స్వభావం ఉంది. అందుకనే మార్కెట్లో ఈరకం పూలకు ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం పసుపురంగు ఉన్న పూలతోపాటు ఇప్పుడిప్పుడే తెలుపు రంగు రకం పూల సాగుపై రైతులు ఆసక్తి చూపిస్తుండడం విశేషం.
ఎకరానికి 5 టన్నుల దిగుబడి
సెంట్‌ఎల్లో పూల సాగులో 4 నుంచి 5టన్నుల పూల దిగుబడి వస్తుంది. ఇంకా మంచి ఎరువులు వేసి సకాలంలో తోటలను కాపాడుకొంటే మరో టన్ను వరకు అఽధికదిగుబడి రావచ్చు. సాధారణంగా 120 నుంచి 150 రోజుల నుంచి పూల దిగుబడి ప్రారంభమైన మరో 90 రోజుల పాటు పూల కోతలు వస్తుంటాయి. ఈలెక్కన పంట కాలం 7నెలల పాటు ఉంటుంది.
ఎకరంలో సాగు చేశా
సెంట్‌ఎల్లో రకం పూలను ఎకరం పొలంలో సాగు చేశాను. నారు మొక్కలు నాటి నుంచి పూల కోతలు మొదలయ్యే వరకు ఎకరానికి రూ. లక్ష వరకు ఖర్చు వచ్చింది. సాధారణ చామంతిపూలతో పోల్చితే ఈ రకం పూలలో నాణ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ రకం పూలు మంచి సువాసన కలిగి ఉంటాయి. మార్కెట్లో కూడా వీటికి మంచి డిమాండ్ ఉంది.
– పద్మావతి రైతు, మొరంకిందపల్లె
నిలకడైన ఆదాయం
ఈరకం పూలసాగులో రైతుకు నిలకడైన ఆదా యం వస్తుంది. మార్కెట్లో పూల ధరలు కొద్దిరోజుపాల పాటు నిలకడగా ఉంటే నష్టాలు రావు. పూలు కుడా మార్కెట్‌కు తీసుకెళ్లేంత వరకు దెబ్బతినకుండా ఉంటాయి. సాధారణ చామంతితో పోల్చితే ఈ రకం పూలుతొందరగా పాడవవు. ఎకరానికి ఎంతలేదన్నా 4 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది.
–రెడ్డిమోహన్, ఫూల రైతు, చెరువుమొరవపల్లె
ప్రస్తుతం ఈ రకం పూలు మార్కెట్లో కిలో రూ. 130 వరకు ధరలు పలుకుతున్నాయి. గత ఇరవైరోజులుగా ఇవే ధరలు మార్కెట్లో నిలకడగా ఉండడంతో రైతులు మంచి లాభాలు గడిస్తున్నారు. ఈ లెక్కన ఎకరానికి రూ. 3.20 లక్షల నుంచి రూ. 4 లక్షల ఆదాయం వస్తోంది. పంటసాగు ఖర్చు, కోతకూలీలు, రవాణా ఖర్చులు పోను ఎకరానికి రూ. 2.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు లాభాలు చవిచూసే అవకాశముంది. మార్కెట్లో ధరల నిలకడను బట్టి ఆదాయ, లాభాలు మారవచ్చు. పండుగ సీజన్‌లో ధరలు పెరుగుతాయి. మొన్న దసరా దీపావళీ పండుగ సీజన్‌లొ మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటకా రాష్ట్రాల్లో కిలో రూ.150 నుంచి రూ.250 వరకు ధరలు పలికాయి. ప్రస్తుతం పడమటి ప్రాంతాల రైతులు ఈ రకం పూల సాగు ఎక్కువగా చేపట్టారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో పాటు రానున్న జనవరిలో సంక్రాంతి పండుగల సీజన్‌లొ మంచి ధరలు పలికే అవకాశముంది.
ఎకరానికి రూ.లక్ష ఖర్చు
సెంట్‌ఎల్లో పూలసాగు దుక్కుల దగ్గర నుంచి పూలు చేతికొచ్చేంత వరకు రూ. లక్ష వరకు ఖర్చు వస్తుంది. ఎకరానికి 8వేలు నుంచి 10 వేల మొక్కలు నాటాల్సి ఉంటుంది. ఒక నారు మొక్క మార్కెట్లో రూ.3 వరకు ధర పలుకుతోంది. ఈలెక్కన ఎకరానికి రూ. 30 వేలు నారు మొ క్కలకు ఖర్చు వస్తుంది. ఎరువులు, పురుగుల మందుల పిచికారి చేయాల్సి ఉంటుంది. ప్రస్తు తం టమాటా తోటలు మాదిరిగా ఈమొక్కలకు సీడ్ కట్టెలు నాటే ప్రక్రియను రైతులు చేపట్టారు. మొక్కలు నాటిని 120 నుంచి 150 రోజుల మధ్యలో పూల దిగుబడి మొదలవుతుంది.
మార్కెట్లో కిలో రూ.130
నిలకడైన ఆదాయంతో రైతుకు లాభాలు
పండుగ సీజన్లలో భలే గిరాకీ
Comments
Please login to add a commentAdd a comment