●బాల్య వివాహాలు నేరం
ఓబులవారిపల్లె: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని జెడ్పీ సీఈఓ ఓబులమ్మ పేర్కొన్నారు. బుధవారం చిన్నఓరంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘బాల్యవివాహాల నిషేధ చట్టం’పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం... అవగాహన లేమితో బాల్య వివాహాలు జరుగుతున్నాయన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని,వాటిని అరికట్టేందుకు అంగన్వాడీ టీచర్లు, స్వయం సహాయక సంఘాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మల్ రెడ్డి, రామ్మోహన్రెడ్డి, ఐసీడీసీ సూపర్ వైజర్ అనుసూయమ్మ, గణపతి, ఎంఈఓ రెడ్డయ్య, ప్రిన్సిపాల్ మల్లికార్జున రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment