1న హ్యాండ్‌బాల్ ఎంపికలు
కడప స్పోర్ట్స్: కడప నగరంలోని డీఎస్‌ఏ క్రీడామైదానంలో డిసెంబర్ 1వ తేదీ ఉదయం జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్ సీనియర్ పురుషుల విభాగం ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె. చిన్నపరెడ్డి, ఎ. సింధూరి తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికయ్యే క్రీడాకారులు డిసెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించే రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే వారు 3 పాస్‌పోర్టు సైజుఫొటోలు, ఆధార్‌కార్డు తీసుకురావాలని సూచించారు.
19 నుంచి శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్: కెనరా బ్యాంకు స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో డిసెంబరు 19 నుంచి ఫొటో, వీడియోగ్రఫీ, సెల్‌ఫోన్ రిపేరింగ్, సర్వీసింగ్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్‌లో నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. 18–45 ఏళ్లలోపు కలిగి ఆసక్తిగల యువకులకు శిక్షణ ఇస్తామన్నారు. గ్రామీణ ప్రాంత యువతకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 94409 05478, 99856 06866, 94409 33028 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
సచివాలయం తనిఖీ
సిద్దవటం: మండలంలోని మాధవరం–1 గ్రామ సచివాలయాన్ని బుధవారం డీపీఓ రాజ్యలక్ష్మి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పంచాయతీలో జరుగుతున్న స్వర్ణ పంచాయతీల సర్వేలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల ప్రకారం జిల్లాలో స్వర్ణ పంచాయతీలో చేపట్టిన సర్వే రిపోర్టులు పక్కాగా తయారు చేయాలన్నారు. కార్యదర్శులు ఇంటి పన్ను, నాన్ ట్యాక్స్‌లను పరిశీలించి 30 తేదీ లోపల అప్లోడ్ చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్‌డీ మహతాబ్‌యాస్మిన్, కార్యదర్శి లక్ష్మినరసయ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
రికార్డుల పరిశీలన
నందలూరు: మండల కేంద్రంలోని నందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధ వారం అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కె సుబ్రమణ్యం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. తరగతి గదుల్లో జరుగుతున్న బోధన అభ్యసన ప్రక్రియలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఉపాధ్యాయులకు సంబంధించిన అకడమిక్ మానిటరింగ్ అంశాలను పరీక్షించారు. అన్నమయ్య జిల్లా జీసీడీఓ ఎస్ శశికళ, డీఈఓ కార్యాలయ క్యాంప్ క్లర్క్ ఎస్ హబీబ్, పాఠశాల ఇన్‌చార్జ్ హెడ్మాస్టర్ ఎస్ రౌఫ్ బాష, పాఠశాల ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
సంఘాలు బలోపేతం కావాలి
పెద్దతిప్పసముద్రం: రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘాలోన్లి సభ్యులు సంఘాల బలోపేతానికి కృషి చేయాలని ఉద్యాన శాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ డీ.అండాల్ రైతులకు సూచించారు. బుధవారం ఆయన మండలంలోని మద్దయ్యగారిపల్లి సమీపంలోని ఎఫ్‌పీవో కేంద్రాన్ని సందర్శించి రైతులకు పలు సూచనలు చేశారు. సదరు కేంద్రం పరిధిలో ఎంత మంది రైతులు సభ్యులుగా ఉన్నారు, రైతులకు అందజేస్తున్న వ్యవసాయ యాంత్రిక పరికరాలు, ఎరువులు, పురుగుల మందులు, రైతుల రుణాలకు సంభంధించిన బ్యాంకు లావాదేవీలను అడిగి తెలుసుకున్నారు. అన్న మయ్య జిల్లా ఉధ్యాన శాఖ అధికారి రవీంద్రబాబు, హెచ్‌వో భీమేష్, ఏపీ మాస్ వాసుదేవ్‌రెడ్డి, వీహెచ్‌ఏ మహబూబ్‌బాషాతో పాటు ఎఫ్‌పీవో నిర్వాహకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment