నేటి నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
పులివెందుల రూరల్ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 24వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు పులివెందులలో పర్యటించనున్నారు. 24వ తేదీన ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని దివంగత వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ప్రేయర్ హాల్‌లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కడప నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్లి రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు. ఈనెల 25వ తేదీన ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించిన అనంతం పులివెందుల చేరుకుని రాత్రికి బస చేస్తారు. ఈనెల 26వ తేదీ పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ఈనెల 27వ తేదీన ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్‌న్స్‌లో జరిగే వివాహానికి హాజరవుతారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి బెంగళూరు వెళతారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ రాక
ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ
లింగాల : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తాతిరెడ్డిపల్లె గ్రామంలో పర్యటించనున్నారు. శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ట వేడుకలో ఆయన పాల్గొంటారని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులతో, ఎస్‌ఐ మధుసూదనరావుతో ఎంపీ చర్చించారు. భద్రతా ఏర్పాట్లపై ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గ్రామ నాయకులు మల్లికేశ్వరరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, పుల్లారెడ్డి, జెడ్పీటీసీ పుష్ప, బ్రహ్మానందరెడ్డి, గంగాధర, మండల నాయకులు బాబురెడ్డి, మల్లికార్జునరెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment