సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
రాయచోటి : ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో బాధ్యతగా పరిష్కరించాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదుల పరిష్కారంపై నేరుగా పర్యవేక్షణ చేయడం జరుగుతోందన్నారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం రాయచోటికి వచ్చిన అర్జీదారులకు జిల్లా కలెక్టర్ స్నాక్స్, వాటర్ బాటిల్స్, టీ సౌకర్యాలు కల్పించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డిఆర్ఓ మధుసూదన్ రావు, ఎస్డీసి రామసుబ్బయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment