బాధితులకు న్యాయం చేయాలి
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని, ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం చేయరాదని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అర్జీలు స్వీకరించి అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడారు.వారి సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
బాధితుడి వద్దకు ఎస్పీ
బి.కొత్తకోటకు చెందిన వికలాంగుడు మోహన్ నడవలేని స్థితిలో సోమవారం ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్పీ తన ఛాంబర్ నుంచి గేటు వద్ద ఉన్న మోహన్ వద్దకు వెళ్లి వినతిపత్రాన్ని స్వీకరించారు. మోహన్ సమస్యను చట్ట పరిధిలో పరిష్కరించాలని మదనపల్లి డీఎస్పీని ఎస్పీ ఆదేశించారు.
సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత
జిల్లాలో పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు అన్నారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డే సందర్భంగా పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారంపై ఎస్పీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్లు, ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది వారి వ్యక్తిగత, స్పౌస్, చిల్డ్రన్స్, మెడికల్ సమస్యల గురించి జిల్లా ఎస్పీకి స్వయంగా విన్నవించుకున్నారు. వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన కొంత మంది పోలీసు సిబ్బంది కూడా ఎస్పీని కలిసి సమస్యలు చెప్పుకున్నారు.
జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు
Comments
Please login to add a commentAdd a comment