రేషన్‌షాపుల అక్రమాలపై విచారణ జరపాలి
మదనపల్లె : మండలంలోని సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్, రిటైర్డ్ డీటీ కలిసి రేషన్ షాపుల్లో చేసిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మదనపల్లె రూరల్ షాపు నంబర్ 54కు డీలర్ లియాఖత్ ఉండగా.. సీఎస్ డీటీ, రిటైర్డ్ డీటీ కలిసి గతంలో పని చేసిన తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ చేసి కిషోర్‌కు షాప్ కేటాయించారన్నారు. అలాగే మదనపల్లె అర్బన్ షాపు నంబర్ 48 డీలర్ రమాదేవి పదేళ్లుగా కర్నూలులో ఉంటుండగా, డీటీ సహకారంతో మోహన్‌కుమార్ షాపును నడుపుతున్నారన్నారు. రేషన్ డీలర్ల నుంచి కమీషన్ల కోసం రూరల్‌లోని షాపుల కార్డులు అర్బన్‌కు, అర్బన్‌లోని షాపుల కార్డులు రూరల్‌కు మార్చారని ఆరోపించారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు కేటాయించిన షాపులు గ్రూపు సభ్యులే నిర్వహించాల్సి ఉండగా, ఇష్టానుసారంగా బినామీల సహాయంతో నిర్వహిస్తున్నారన్నారు. రేషన్ సరుకులు ఇంటింటికీ డెలివరీ చేసేందుకు వినియోగిస్తున్న వాహనాలు మదనపల్లె మండలంలో 35 ఉండాలని, వాటిలో కేవలం 30 వాహనాలు పని చేస్తుంటే, మిగిలిన 5 వాహనాలు డోర్ డెలివరీ చేస్తున్నట్లుగా తప్పుడు బిల్లులు రాసి డ్రా చేస్తున్నారన్నారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment