కిశోర వికాసంతో ఉజ్వల భవిత | - | Sakshi
Sakshi News home page

కిశోర వికాసంతో ఉజ్వల భవిత

Published Wed, Dec 25 2024 2:33 AM | Last Updated on Wed, Dec 25 2024 2:33 AM

కిశోర వికాసంతో ఉజ్వల భవిత

కిశోర వికాసంతో ఉజ్వల భవిత

వీరబల్లి : కిశోర వికాసంతో బాలికలకు ఉజ్వల భవిష్యత్తు చేకూరుతుందని ఐసీడీఎస్‌ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ రమాదేవి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కిశోర వికాసంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిశోర వికాసం అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. మొదటి విడత లో రెండు లక్షల మందికి చైతన్యం కల్పించామని, రెండో విడతలో ప్రతి వ్యక్తికి చైతన్యం కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాల్య వివాహాలు, లైగింక హింస, టీనేజ్‌ ప్రెగ్నెన్సీ లాంటి అనేక సమస్యలను బాలికలు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రతి గ్రామంలో ఇలాంటి సమస్యలు లేకుండా చేయాలంటే.. కిశోర వికాస గ్రూపులను ఏర్పాటు చేసి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నూర్జహాన్‌, ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ సరస్వతమ్మ, లలితమ్మ, ఐసీడీఎస్‌ ఎక్సెన్షన్‌ అధికారి రాజేశ్వరీ, మహిళా సంరక్షణ కార్యదర్శులు, అంగన్‌ వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement