లింగ నిర్ధారణకు పాల్పడితే స్కానింగ్ సెంటర్లపై కేసులు
రాయచోటి: జిల్లాలో మోసపూరితంగా లింగ నిర్ధారణకు పాల్పడితే స్కానింగ్ సెంటర్లపై ఎఫ్‌ఐఆర్ కేసులు నమోదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాయచోటిలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి బహుళ సభ్యుల సముచిత అధికార కమిటీ సమావేశం, డీఎల్‌ఏసీ, ఏఆర్‌టీ కమిటీ జాయింట్ కమిటీ మీటింగ్‌ను నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండయ్య జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల వివరాలు, వాటి నిర్వహణ, రికార్డ్స్ అప్‌లోడింగ్ డిటెయిల్స్ వాటి వివరాలను కలెక్టర్‌కు తెలియపరిచారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కలెక్టర్ సమక్షంలో ఆరు కొత్త స్కాన్ సెంటర్లు, ఒక రెన్యువల్, ఆరు స్కాన్ సెంటర్లలో సవరణలకు అనుమతులు ఇచ్చారు. పారం–ఎఫ్ తరచూ అప్‌లోడ్ చేయని సెంటర్ల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు.
● దివ్యాంగుల అభివృద్ధికి అంగవైకల్యం అడ్డు రాకూడదని జిల్లా కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాకు చెందిన ఇద్దరు విభిన్న ప్రతిభావంతులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వర్చువల్‌గా, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేతులు మీదుగా ఉచిత స్కూటర్‌ర్లను పంపిణీ చేశారు. లక్కిరెడ్డిపల్లి మండల పరిధిలోని కాపుపల్లికి చెందిన కట్ట ఆదినారాయణ (40), వేములవాండ్లపల్లికి చెందిన కాల్వ చంద్రశేఖర్ (90)లకు రెండు లక్షల రూపాయలతో కొన్న 02 రెట్రో ఫిటెడ్ మోటర్ స్కూటర్లు పంపిణీ చేయడం జరిగింది.
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
పజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. సోమ వారం ఇక్కడ కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను నాణ్యతగా పరిష్కరించినప్పుడే ప్రజలకు మనపై విశ్వాసం కలుగుతుందని అన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment