పింఛన్ల ధ్రువీకరణ పరిశీలన పక్కాగా చేయాలి
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్
రాయచోటి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జిల్లాలో దివ్యాంగుల ఫెన్షన్ల ధ్రువీకరణ పరిశీలన కార్యక్రమాన్ని పక్కగా చేయాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, గ్రామీణ అభివృద్ధి ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్ కుమార్, సేర్ప్ సీఈఓ వీరపాండ్యన్, సదరం వైకల్య ధ్రువీకరణ పత్రాల స్క్రీనింగ్ నూతన మార్గదర్శకాలపై జిల్లా కలెక్టర్లు, డీఆర్‌డీఏ, వైద్య ఆరోగ్య, మున్సిపల్ జిఎస్‌డబ్ల్యూఎస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సదరం వైకల్య ధ్రువీకరణ పత్రాల స్క్రీనింగ్ నిమిత్తం జిల్లాస్థాయిలో ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. వీరి ఆధ్వర్యంలో వివిధ మండలస్థాయి బృందాలను ఏర్పాటు చేస్తారన్నారు. వీరిలో 85శాతం, 40 శాతం పైబడిన రెండు కేటగిరిల్లో పరిశీలన పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1600 మంది వరకు 85శాతం పైబడి వికలత్వం కల్గిన వారు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. నియోజకవర్గం వారిగా ఆయా మండలంలో ఏ ఏగాంమలో ఎన్నెన్ని పెన్షన్లు ఉన్నాయన్న సమాచారాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు. మార్గదర్శకాల మేరకు బృందాల ఏర్పాటు నిమిత్తం డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్, కడప జీజీ హెచ్ సూపరిటెండెంట్‌లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ, వైద్య ఆరోగ్య పంచాయతీ, డీఎస్‌డబ్ల్యుఎస్ జిల్లా అధికారులు, మున్సిపల్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment