ఉద్యోగ భద్రత హామీని నిలబెట్టుకోండి
నందలూరు: గ్రామ వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ రూ. 10 వేలు వేతనంతో ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి డిమాండ్ చేశారు.గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని, వలంటీర్ల వేతన బకాయిలను త్వరితగతిన చెల్లించాలని, వారికి ఉద్యోగ భత్రత కల్పించాలని అన్నారు. లేనిపక్షంలో వలంటీర్లు చేపట్టే దీక్షలకు, ధర్నాలకు వైఎస్సార్‌సీపీ తరఫున మద్దతు తెలుపుతామని చెప్పారు.కార్యక్రమంలో అరిగెల సౌమిత్రి, గుండు మల్లికార్జున రెడ్డి, పల్లె గ్రీష్మంత్ రెడ్డి, అన్నమయ్య జిల్లా వైఎస్సార్ సిపి అధికార ప్రతినిధి విశ్వనాథ్ రెడ్డి, సుబ్బరాజు , దండుగోపి, నాగసుబ్బయ్య, శంకర, కళ్యాణ్ రెడ్డి, నందలూరు ఉప సర్పంచ్ ఇబ్బు, ఎన్టీఆర్ కాలనీ హరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment