రాయచోటి: రాయచోటి పట్టణం మదనపల్లె మార్గం సమీపంలో అక్రమరవాణాకు సిద్ధం చేస్తున్న పీడీఎస్ బియ్యం ప్యాకెట్లను ఎస్పీ స్పెషల్ పార్టీ పోలీసులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లె మార్గంలో ఉన్న షామీర్ కల్యాణ మండపం సమీపంలోని నివాసగృహంలో పక్క రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధం చేస్తుండగా 210 బియ్యం ప్యాకెట్లతో పాటు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం రెవెన్యూ అధికారులకు అప్పగించి తదుపరి విచారణను కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని బియ్యం పట్టుకున్న అధికారులు తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment