టీటీడీ బోర్డు స్పందించాలి
రాజంపేట: ‘అదివో.. అల్లదివో.. శ్రీహరివాసము.. బ్రహ్మకడిగిన పాదము’.. అంటూ సులువైన పదాలతో కీర్తనలు ఆలపించిన వాగ్గేయకారుడు అన్నమయ్య జన్మస్థలిలో.. పర్యాటకులు, యాత్రికులు శ్రీవారి (శ్రీ వెంకటేశ్వరస్వామి) దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఇక్కడ అభివృద్ధి దిశగా టీటీడీ పాలకమండలి అడుగులు వేసింది. కూటమి పాలనలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆలయ ప్రారంభం గురించి కూడా పట్టించుకోవడం లేదు. ఈ మార్గంలో నిత్యం టీటీడీ ఉన్నతాధికారులు రాకపోకలు సాగిస్తున్నా.. చూస్తుపోవడమే తప్ప శ్రీవారి ఆలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన చేయకపోవడం విచారకరమని భక్తులు పెదవి విరిస్తున్నారు. ఇటీవల జరిగిన సంఘటనలతో పాలకమండలిపై భక్తుల నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది.
దశాబ్దంన్నర తర్వాత..
అన్నమయ్య ఉద్యానవనంలో దశాబ్దంన్నర తర్వాత (14 ఏళ్లు) మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఎంపిక చేసిన స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించారు. టీటీడీ రూ.కోటికి పైగా వ్యయం చేస్తోంది. ఈ మార్గంలో తిరుమలకు వెళ్లే దక్షిణ భారత యాత్రికులకు ముందుగానే అన్నమయ్య జన్మస్థలిలో శ్రీవారిని దర్శించుకోవడం మహానందగా భావిస్తున్నారు. తాళ్లపాక, 108 అడుగుల విగ్రహం ప్రాంతం పార్కును టీటీడీ అటవీశాఖ సిద్ధం చేసింది. ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో త్వరలో ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. తర్వాత కూటమి సర్కారు రావడం, టీటీడీ కొత్తపాలకమండలి కొలువు తీరడం తదితర పరిణామాలు జరిగాయి. ఇప్పుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలిలోని శ్రీవారి ఆలయం, థీంపార్కు వైపు కూడా కూటమి కన్నెత్తి చూడ
టం లేదన్న అపవాదును మూటకట్టుకుంది.
600 జయంత్యుత్సవాల నుంచి..
అన్నమాచార్యుని 600 జయంత్యుత్సవాలు అప్పటి పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి హయాంలో ఘనంగా జరిగాయి. 108 అడుగుల అన్నమయ్య విగ్రహావిష్కరణకు విచ్చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి హామీలు ప్రకటించారు. ఆయన మరణం తర్వాత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు అన్నమయ్య జన్మస్థలి గురించి మరిచిపోయాయి. అప్పటి టీటీడీ పాలకమండలి తాళ్లపాక, అన్నమయ్య థీంపార్కు అభివృద్ధికి సంబంధించి నిధుల కేటాయింపు చేయలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించారు. అప్పట్లో జెడ్పీచైర్మన్‌గా ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథ్‌రెడ్డి కృషి ఫలితంగా వైవీ సుబ్బారెడ్డి అన్నమయ్య థీంపార్కును సందర్శించారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి హయాంలో మళ్లీ అన్నమయ్య జన్మస్థలి అభివృద్ధిపై దృష్టి సారించారు.
విగ్రహ ప్రతిష్ట చేయాలి
గత ప్రభుత్వ పాలనలో అన్నమయ్య థీంపార్కులో టీటీడీ శ్రీవారి ఆలయ నిర్మితం చేసింది. అయితే ఇప్పటి టీటీడీ అధికారులు అందులో శ్రీవారి విగ్రహ ప్రతిష్ట చేయడం మరిచారు. ఇప్పటికైనా వారు విగ్రహ ప్రతిష్ట చేసి, ఆలయాన్ని ప్రారంభించాలి.
–ఎస్. గౌరీశంకర్, సర్పంచ్,
తాళ్లపాక, రాజంపేట
అన్నమయ్య జన్మస్థలిలోశ్రీవారి ఆలయం
వైఎస్సార్‌సీపీ పాలనలో నిర్మాణం పూర్తి
ప్రారంభంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
పట్టించుకోని టీటీడీ పాలకమండలి
మండిపడుతున్న భక్తజనం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహ ప్రాంతంలో శ్రీవారి ఆలయం నిర్మితం చేశారు. కూటమి ప్రభుత్వం ఇంత వరకు ఆలయాన్ని భక్తులకు అందుబాటులో తీసుకురాలేకపోయింది. ఇప్పటికై నా టీటీడీ బోర్డు స్పందించి ఆలయాన్ని ప్రారంభించాలి.
–పి.విశ్వనాథరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి, వైఎస్సార్‌సీపీ
Comments
Please login to add a commentAdd a comment