కూటమి నాయకుల కబ్జాలను అడ్డుకోండి
– సీపీఐ నాయకుల డిమాండ్
ఓబులవారిపల్లె : కొర్లకుంట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే చెరువు పోరంబోకుకు ఆర్‌అండ్‌బీకి సంబంధించిన ప్రభుత్వ భూమిలో కూటమి నాయకులు యథేచ్ఛగా కబ్జాలు చేసి ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తున్నారని సీపీఐ రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య ఆరోపించారు. శనివారం ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ విలువైన చెరువు పోరంబోకు భూమిలో ఇటివలే గ్రామస్తుడు మనోహర్ బేస్ మట్టం కోసం పునాదులు తీయగా అతనిని అడ్డుకున్నారు. అయితే అదే స్థలం పక్కనే కూటమి నాయకులు కట్టడాలు కట్టి పూర్తిచేసి కబ్జాలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ అధికారులకు ఇది కనిపించదా అని ఆయన ప్రశ్నించారు. ఆక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని లేనిపక్షంలో సీపీఐ తరపున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇంటర్ విద్యార్థి అదృశ్యం
వేంపల్లె : స్థానిక శ్రీరాం నగర్ వీధికి చెందిన తమ్మిశెట్టి శ్రీధర్ (15) అనే విద్యార్థి అదృశ్యమయ్యాడని వేంపల్లె ఎస్‌ఐ రంగారావు తెలిపారు. ఈ మేరకు వేంపల్లె పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. విద్యార్థి తండ్రి వెంకటేష్ తెలిపిన వివరాలు మేరకు.. ఈ నెల 18వ తేదీన రాత్రి 8 గంటలకు కాలేజీకి చక్రాయపేటకు వెళ్లుతున్నానని చెప్పి ఇంటి నుండి శ్రీధర్ వెళ్లిపోయాడన్నారు. రెండు రోజుల తర్వాత విద్యార్థి తండ్రి తమ్మిశెట్టి వెంకటేష్‌కు కళాశాల నుండి మీ అబ్బాయి కాలేజీకి రాలేదని సమాచారం వచ్చిందన్నారు. చుట్టు పక్కల గ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లి వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు
Comments
Please login to add a commentAdd a comment