కడప కల్చరల్ : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లాశాఖ స్పెషల్ ఆఫీసర్‌ను తొలగించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ద్వారా శనివారం ఆదేశాలు వచ్చాయి. ఫలితంగా ఆయన స్థానంలో డీఆర్వో విశ్వేశ్వరనాయుడు నూతన స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కార్యదర్శిగా జిల్లా ఉపాధికారి సురేష్‌కుమార్‌ను నియమించారు. విద్యాశాఖ పూర్వ ఉన్నతాధికారి అలపర్తి పిచ్చయ్యచౌదరి చైర్మన్‌గా పూర్తి కాలం సేవలు అందించిన తర్వాత ఆ పోస్టుకు ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్ పోస్టుకు అభ్యర్థులు పోటాపోటీగా నిలువగా సభ్యుల నియామకంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలిసి కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లారు. ఆ సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. అనంతరం 2023 ఆగస్టు 23న శివశంకర్‌రెడ్డిని స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. రాష్ట్ర మంతటా రెడ్‌క్రాస్ సంస్థలో ప్రస్తుతం ఉన్న స్పెషల్ ఆఫీసర్లను తొలగించి తమకు కావాల్సిన వారిని నియమించుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల నియామకాలు కోర్టులో ఉండగా, వాటిని పూర్తిగా రద్దు చేసి మరీ తమ వారిని తెచ్చుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment