భారతి సిమెంట్స్ సేవలు అభినందనీయం
కమలాపురం : మండలంలోని నల్లింగాయపల్లెలో వెలసిన భారతి సిమెంట్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) సీఎస్‌ఆర్ నిధులతో చేస్తున్న సేవలు అభినందనీయం అని ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి కొనియాడారు. బీసీసీపీఎల్ సీఎస్‌ఆర్ నిధులతో కమలాపురం పట్టణంలోని 9వ వార్డు అంగన్వాడీ అంగన్వాడీ కేంద్రంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను శనివారం ఆయన పరిశీలించారు. చిన్నారులతో మాట్లాడారు. గుడ్డు, చిక్కీలు తదితర పోషకాహారం ఇస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులను సొంత పిల్లల్లా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. కాగా భారతి సిమెంట్స్ ఐఆర్‌పీఆర్ చీఫ్ మేనేజర్ భార్గవ్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళికల వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే చైతన్యరెడ్డి మాట్లాడుతూ కమలాపురం పట్టణంలోని ఐదు అంగన్వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు భారతి సిమెంట్స్ ముందుకు రావడం అభినందనీయం అన్నారు. అలాగే స్కూల్స్‌లో కూడా టాయిలెట్లు, ల్యాబ్స్ తదితరవి ఏర్పాటు చేయాలని పరిశ్రమ ప్రతినిధులను కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ జయ కుమారి, అంగన్వాడీ సిబ్బంది, పెయిడ్ ఎన్‌జీఓ నాగేశ్వర్ రెడ్డి, నగర కమీషనర్ పగడాల జగన్నాథ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చైతన్యరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment