దావోస్ పర్యటనలో బాబు గ్రాఫిక్ విన్యాసాలు
కడప సెవెన్‌రోడ్స్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జరిపిన దావోస్ పర్యటనలో గ్రాఫిక్ విన్యాసాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి తీసుకు రాలేకపోయారని వైఎస్సార్ సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. శనివారం కడపలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం దావోస్‌లో ఒక్క ఎంఓయూ కూడా కుదర్చుకోలేకపోవడం ఆయన అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు.వైఎస్సార్ జిల్లా వనిపెంటకు చెందిన సునీల్‌కుమార్ అనే వ్యక్తికి ఒక కోటు తగిలించి పెట్టుబడిదారుడంటూ మంత్రి నారా లోకేష్‌తో ఫోటో తీయించడం ప్రజలను మభ్యపెట్టేందుకేనని ఆరోపించారు. పైగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చంద్రబాబు ఆరోపించడం ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికేనన్నారు. తెలంగాణ, మహరాష్ట్రలకు పెట్టుబడులు వెళుతున్నాయన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దావోస్ పర్యటనకు వెళ్లినపుడు కొన్ని వందల ఎంఓయూలు కుదుర్చుకున్నారని పేర్కొన్నారు. బాబు దావోస్ పర్యటన వల్ల ప్రభుత్వానికి రూ. 80 కోట్లు ఖర్చయిందే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచినా సరైన పాలన లేకుండా పోయిందన్నారు. సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు పులి సునీల్‌కుమార్, పాకా సురేష్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.
ఒక్క ఎంఓయూ కుదుర్చుకోలేదు
పర్యటన ఖర్చు తప్ప ఒరిగింది లేదు
తగుదునమ్మా అంటూ జగన్‌పై ఆరోపణలు
వైఎస్సార్ సీపీ వైఎస్‌ఆర్ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment