No Headline
‘పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా’.. అని అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామిపై ఆలపించిన కీర్తన బహుళ ప్రాచుర్యం పొందింది.
‘పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా’ అంటే నీ రూపాన్ని కాంచితిమి ప్రభూ.. అని అర్థం. అన్నమాచార్య జన్మస్థలి తాళ్లపాకలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రీ వేంకటనాథుని ఆలయాన్ని సుందర మనోహరంగా నిర్మించింది. అక్కడ స్వామి వారు కొలువుతారనే సంతోషంతో భక్తులు ఎంతో పరవశించారు. అయితే కూటమి ప్రభుత్వం విగ్రహ ప్రతిష్ట, ఆలయ ప్రారంభంపై నిర్లక్ష్యం వహిస్తోంది.
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా’ అంటే తప్పుదారి పట్టిపోయే మానవులను సరైన మార్గంలో నడిపించి బతుకుదారి చూపించే సిద్ధిమంత్రము ఆ స్వామి అని అర్థం. కూటమి పాలకులు, టీడీపీ పాలక మండలి.. తాళ్లపాక ఆలయంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. వారికి బుద్ధి ప్రసాదించి ఆలయం ప్రారంభానికి నోచుకునేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment