గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఆదివారం నిర్వహించే 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సర్వ సిద్ధం చేశారు. పోలీస్ పరేడ్ మైదానాన్ని శనివారం ముస్తాబు చేశారు. ఆదివారం రాయచోటిలోని పోలీస్ పెరేడ్ మైదానంలో వేడుకలు ప్రారంభం అవుతాయని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 8.50 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరణ అనంతరం పోలీసుల కవాతు(మార్చ్ ఫాస్ట్) ఉంటుందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సందేశం, పోలీసు జాగిలాల విన్యాసాలు, జిల్లా ప్రగతిని చాటే శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేస్తారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని కలెక్టర్ కోరారు.
ముస్తాబైన పోలీస్ పరేడ్ మైదానం, కలెక్టరేట్
Comments
Please login to add a commentAdd a comment