ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకం
రాయచోటి: ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఓటుహక్కే కీలకమని, ఓటు వేయడం పౌరుల హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా అని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాయచోటిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి కలెక్టర్ బంగ్లా వరకు జరిగిన ఓటర్ల దినోత్సవ ర్యాలీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఓటుహక్కుకు సమానమైనది ఏదీలేదని.. నేను కచ్చితంగా ఓటు వేస్తాను అనే ధీమాతో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న పౌరులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్‌ఓ మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఛామకూరి
Comments
Please login to add a commentAdd a comment