శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం,వర్ష ఋతువు, భాద్రపద మాసం,తిథి: బ.పంచమి రా.9.12 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం: భరణి ఉ.6.31 వరకు, తదుపరి కృత్తిక తె.5.10 వరకు (తెల్లవారితే సోమవారం),వర్జ్యం: సా.5.52 నుండి 7.20 వరకు, దుర్ముహూర్తం: సా.4.21 నుండి 5.09 వరకు, అమృతఘడియలు: రా.3.05 నుండి 4.36 వరకు.
మేషం: సమాజసేవలో భాగస్వాములవుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నిరుత్సాహం..
వృషభం: ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. పనుల్లో ప్రతిబంధకాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.
మిథునం: పనుల్లో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. దూరపు బంధువుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
కర్కాటకం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. భూవివాదాల పరిష్కారం. ఆధ్యాత్మిక చింతన. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
సింహం: బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
కన్య: సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు.
తుల: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.
వృశ్చికం: పాతబాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
ధనుస్సు: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
మకరం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. నిర్ణయాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.
కుంభం: కార్యజయం. ఆస్తి ఒప్పందాలు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు..
మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.
Comments
Please login to add a commentAdd a comment