శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: బ.షష్ఠి రా.7.26 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: రోహిణి తె.4.16 వరకు (తెల్లవారితే మంగళవారం), తదుపరి మృగశిర, వర్జ్యం: రా.8.35 నుండి 10.07 వరకు, దుర్ముహూర్తం: ప.12.19 నుండి 1.07 వరకు, తదుపరి ప.2.43 నుండి 3.31 వరకు, అమృతఘడియలు: రా.1.20 నుండి 2.51 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.52, సూర్యాస్తమయం: 5.55.
మేషం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలు మందగిస్తాయి.
వృషభం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
మిథునం: మిత్రులు, బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు.
సింహం: సన్నిహితులతో వివాదాల పరిష్కారం. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు.
కన్య: ఆర్థికంగా ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. పనుల్లో తొందరపాటు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రతికూలత.
తుల: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో మార్పులు.
వృశ్చికం: వ్యవహారాలలో విజయం. ఆస్తులు సమకూర్చుకుంటారు. నూతన విద్యావకాశాలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.
ధనుస్సు: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. పనులు చకచకా పూర్తి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
మకరం: పరిస్థితులు అనుకూలించవు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
కుంభం: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో నిరాశ తప్పకపోవచ్చు.
మీనం: నూతన పరిచయాలు. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. పనుల్లో విజయం. భూలాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment