శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: షష్ఠి సా.4.59 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: విశాఖ ప.2.50 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: రా.7.07 నుండి 8.47 వరకు, దుర్ముహూర్తం: ప.12.24 నుండి 1.12 వరకు తదుపరి ప.2.51 నుండి 3.39 వరకు, అమృతఘడియలు: తె.5.16 నుండి 6.56 వరకు(తెల్లవారితే మంగళవారం), రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.49, సూర్యాస్తమయం: 6.07.
మేషం: దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. ఆకస్మిక ధనలాభం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.
వృషభం: అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటర్వ్యూలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. కుటుంబసమస్యలు. చర్చలలో ప్రతిష్ఠంభన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. దైవదర్శనాలు.
కర్కాటకం: బంధువుల నుంచి ఒత్తిళ్లు. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
సింహం: ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
కన్య: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పడ్డా పనులు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
తుల: నూతనోత్సాహంతో పనులు పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బాకీలు వసూలవుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
వృశ్చికం: వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
ధనుస్సు: కొత్త విషయాలు తెలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
మకరం: కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
కుంభం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మీనం: కుటుంబసమస్యలు. వ్యవహారాలలో అవాంతరాలు. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. విద్యార్థులకు కొద్దిపాటి ఇబ్బందులు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment