రేపల్లె రూరల్: రేపల్లె పట్టణంలో ఓ యువకుడు మంగళవారం రాత్రి హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని 23వ వార్డు చెందిన మేక రాముడు, నాగమణిల కుమారుడు మేక సాయికుమార్, జగనన్న కాలనీలో అద్దెకు నివాసం ఉండే హర్ష, రేపల్లె ఓల్డ్ టౌన్‌కు చెందిన జయప్రకాష్ చిన్ననాటి స్నేహితులు. ఈ నేపథ్యంలో జయప్రకాష్ మంగళవారం రాత్రి సాయికుమార్‌ను మద్యం సేవించేందుకు అరవపల్లి రోడ్డులోని శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లాడు. అక్కడకు హర్ష కూడా వచ్చాడు. ఈ సమయంలో జయప్రకాష్ ఫోన్‌లో చార్జింగ్ అయిపోవడంతో ఇంటివద్ద పెట్టుకుని వస్తానని వెళ్లాడు.
తిరిగి వచ్చి చూసేసరికి సాయికుమార్ మరణించి ఉన్నాడు. హర్ష కనిపించలేదు. మెడపై కత్తితో పొడిచిన గాయాలు ఉండడంతో హత్యగా భావించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సాయికుమార్, హర్ష చిన్ననాటి నుంచే స్నేహితులు. ఇద్దరి మధ్య మూడునెలల క్రితం విభేదాలు పొడచూపాయి. ఈ కక్షతోనే హర్ష సాయికుమార్‌ను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పట్టణ సీఐ నజీర్ బేగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment