జాతీయస్థాయి ఈత పోటీలకు ఎస్‌ఎస్‌ఎన్ విద్యార్థి
నరసరావుపేట ఈస్ట్: జాతీయ స్థాయి స్విమ్మింగ్ (ఈత) పోటీలకు శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల విద్యార్థి వై.మధు కిషోర్ ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ఎస్.సుధీర్, వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ యక్కల మధుసూదనరావు మంగళవారం తెలిపారు. విశాఖలోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈనెల 7,8 తేదీలలో నిర్వహించిన 9వ రాష్ట్రస్థాయి శీతాకాలపు సబ్‌జూనియర్, జూనియర్ అంతర్ జిల్లాల బాలబాలికల స్విమ్మింగ్ చాంపియన్‌షిప్–2024 పోటీల్లో మధుకిషోర్ 200 మీటర్లు బటర్‌ఫ్లై విభాగంలో బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని వివరించారు. ఈనెల 28వ తేదీన విజయవాడలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో మధుకిషోర్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడని తెలిపారు. కళాశాల పాలకవర్గం అధ్యక్ష, కార్యదర్శులు కపలవాయి విజయకుమార్, నాగసరపు సుబ్బరాయగుప్త, వైస్‌ప్రిన్సిపల్ డాక్టర్ పి.శ్రీనివాససాయి, అధ్యాపకులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment