నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందించాలి
విద్యుత్ శాఖ పల్నాడు జిల్లా ఎస్‌ఈ ప్రత్తిపాటి విజయ్‌కుమార్
పిడుగురాళ్ల: గృహవాసులకు నాణ్యమైన విద్యుత్ అందించాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపై ఉందని ఆ శాఖ ఎస్‌ఈ డాక్టర్ ప్రత్తిపాటి విజయ్‌కుమార్ చెప్పారు. పట్టణంలోని కొండమోడు సమీపంలో ఉన్న విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లుల వసూళ్లు విషయంలో అధికారులు అశ్రద్ధ చేయరాదని చెప్పారు. మొండి బకాయిల జాబితాను సిద్ధం చేసుకొని ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు వెళ్లి బకాయిలను వసూలు చేయాలని వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. పిడుగురాళ్ల పట్టణంలో ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీసును ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కార్యాలయంలో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల డివిజనల్ ఇంజినీర్ నూతలపాటి సింగయ్య, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment