డాక్టర్‌ నరేంద్రరెడ్డి సేవలకు ప్రత్యేక గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ నరేంద్రరెడ్డి సేవలకు ప్రత్యేక గుర్తింపు

Published Tue, Dec 31 2024 2:11 AM | Last Updated on Tue, Dec 31 2024 2:11 AM

డాక్ట

డాక్టర్‌ నరేంద్రరెడ్డి సేవలకు ప్రత్యేక గుర్తింపు

గుంటూరు మెడికల్‌: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) అభివృద్ధికి గుర్తింపు తీసుకొచ్చేందుకు డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి అందించిన సేవలు అభినందనీయమని ఐఎంఏ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ ఆర్‌వీ అశోకన్‌, డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ జె నాయక్‌ పేర్కొన్నారు. ఐఎంఏ జాతీయ ఉత్తమ కార్యదర్శిగా సీనియర్‌ జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జన్‌, సాయి భాస్కర్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి అవార్డు అందుకున్నారు. 2023–2024 సంవత్సరానికిగాను గుంటూ రు బ్రాంచిని అన్ని విభాగాలలో ఉత్తమ పనితీరు కనపరిచేలా తీర్చిదిద్దినందుకు గాను డాక్టర్‌ బూసిరెడ్డికి ఈ అవార్డు దక్కింది. ఇటీవల హైదరాబాదులో రెండు రోజులు పాటు జరిగిన ఐఎంఏ జాతీయ సమావేశాల్లో భాగంగా శనివారం రాత్రి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో వేదశ్రీకి ప్రథమ స్థానం

చీరాల అర్బన్‌: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న టి.వేదశ్రీ విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచిందని కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.స్నేహలత సోమవారం తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్లలో జరిగిన జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలలో సీనియర్‌ ఎంపీసీ విద్యార్థిని ఐ.ఈశ్వరి ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతిని సాధించిందన్నారు. వక్తృత్వ పోటీల్లో జిల్లా స్థాయిలో జూనియర్‌ ఇంటర్‌ సీఈసీ విద్యార్థిని బి.రాణి తృతీయ బహుమతిని సాధించిందన్నారు. విజేతలను కళాశాల పిన్సిపాల్‌, అధ్యాపకులు అభినందించారు. చదువుతోపాటు క్రీడారంగంలోనూ, సారస్వత రంగంలోనూ విద్యార్థినులు రాణించాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు మధుసూదనరావు, రాధాదేవి, పీడీ బాపయ్య, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
డాక్టర్‌ నరేంద్రరెడ్డి సేవలకు ప్రత్యేక గుర్తింపు 1
1/1

డాక్టర్‌ నరేంద్రరెడ్డి సేవలకు ప్రత్యేక గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement