ఏఎన్‌యూకు ఆరు పతకాలు
ఏఎన్‌యూ: ఆల్ ఇండియా యూనివర్సిటీ (ఏఐయూ) నిర్వహించే అంతర విశ్వవిద్యాలయాల 38వ సౌత్ జోన్ యువజన ఉత్సవాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆరు పతకాలు సాధించిందని యువజన ఉత్సవాల కోఆర్డినేటర్ ఆచార్య ఎస్.మురళీమోహన్ తెలిపారు. ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు చైన్నెలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో నిర్వహించిన యువజనోత్సవాలలో 24 విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి. వీటిల్లో ఆరు పతకాలను వర్సిటీ సాధించినట్లు వివరించారు. వాటిల్లో స్పాట్ ఫొటోగ్రఫీలో రెండో స్థానం, మెహందీలో మూడో స్థానం, మైమ్‌లో మూడవ స్థానం, ఇన్ స్టా లేషన్‌లో మూడో స్థానం, కార్టూనింగ్‌లో మూడో స్థానం, కొలీజ్ లో మూడో స్థానం పొందినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వర్సిటీకి పతకాలు సాధించిన విద్యార్థి కళాకారులను ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.గంగాధర రావు, ఇన్‌చార్జి రెక్టర్ కె.రత్నషీలామణి, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ జి.సింహాచలం అభినందించారు.
సౌత్ జోన్ యువజన ఉత్సవాల్లో విద్యార్థుల ప్రతిభ
Comments
Please login to add a commentAdd a comment