బుధవారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2025
నేటి నుంచి అంతర్‌రాష్ట్ర క్రికెట్ టోర్నీ
మేదరమెట్ల: మండలంలోని రావినూతల గ్రామంలోగల రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 31వ అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ బుధవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. భ్రమర సంక్రాంతి కప్ 2025 పేరుతో నిర్వహించే ఈ పోటీలను ఉదయం 9.30 గంటలకు అతిథులచే ప్రారంభం కానున్నాయి. మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.3 లక్షలు, రూ.2 లక్షలు, రూ.లక్ష నగదు బహుమతులతోపాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద టోర్నీ, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాటర్, బెస్ట్ ఫీల్డర్ అవార్డులను బహూకరించనున్నారు. మొదటి మ్యాచ్ ఉదయం 10.30 జీడీసీఏ లెవెన్ (గుంటూరు)–స్పార్టన్ వారియర్స్ (తిరుపతి) జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment