యద్దనపూడి: మండలంలోని అనంతవరంలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో నాటికపోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గుదే పాండురంగారావు తెలిపారు. మంగళవారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గ్రామస్తుల సహకారంతో మూడేళ్లుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాలుగురోజులపాటు నిర్వహించే పోటీల్లో 15న న్యూస్టార్ మోడరన్ థియేటర్ ఆర్ట్స్ విజయవాడ వారిచే ‘ఐ హేట్ ఇండియా, రెండో నాటిక సద్గురు కళానిలయం గుంటూరు వారిచే ‘కమనీయం’, 16న యంగ్ థియేటర్ విజయవాడ వారిచే ‘27వ మైలురాయి’, వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ వారిచే ‘నిశి’, 17న స్నేహ ఆర్ట్స్ వింజనంపాడు వారిచే ‘కొండంత అండ’, శ్రీకారం రోటరీ కళాపరిషత్ వారిచే ‘ఏది నిజం’, 18న చైతన్య కళాస్రవంతి విశాఖపట్నం వారిచే ‘(అ)సత్యం’, సాయి ఆర్ట్స్ కొలకలూరివారిచే ‘జనరల్ బోగీలు’ ప్రదర్శిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment