వైభవంగా శివ ముక్కోటి పర్వదినం
మంగళగిరి(తాడేపల్లి రూరల్): మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శివ ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉత్తర ద్వార దర్శన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి జేవీ నారాయణ మాట్లాడుతూ స్వామి తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వారంలో భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారన్నారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన లు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఉత్సవానికి బచ్చు వెంకట ఉల్లక్కి, మాణిక్యమ్మ జ్ఞాపకార్థం మాజేటి లక్ష్మీ నరసింహమూర్తి, లలిత దంపతులు కై ంకర్యపరులుగా వ్యవహరించారని, అనంతరం గ్రామోత్సం నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు టి. మహేష్‌కుమార్‌శర్మ, దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ భోగి కోటేశ్వరరావు, డాక్టర్ వంశీకృష్ణ మాజేటి, దీప దంపతులు, ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment