17,18 తేదీల్లో ఉచిత ప్లాస్టిక్‌ సర్జరీల పరీక్ష శిబిరం | - | Sakshi
Sakshi News home page

17,18 తేదీల్లో ఉచిత ప్లాస్టిక్‌ సర్జరీల పరీక్ష శిబిరం

Published Tue, Jan 14 2025 9:11 AM | Last Updated on Tue, Jan 14 2025 9:11 AM

-

గుంటూరు ఎడ్యుకేషన్‌: సికింద్రాబాద్‌ ఓల్డ్‌ మల్లేపల్లి సీతారాంబాగ్‌ లోని లయన్స్‌ క్లబ్‌ ఆసుపత్రిలో ఈనెల 17, 18 తేదీల్లో ఉచిత మెగా ప్లాస్టిక్‌ సర్జరీల పరీక్ష శిబిరాన్ని నిర్వహించనున్నట్లు రామ్‌ కీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఎం.వి. రామిరెడ్డి, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ గ్రీన్‌ ల్యాండ్‌ ప్రతినిధి విద్యాభూషణ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రహణ మొర్రి , గ్రహణం అంగుళీకం, కాలిన గాయాలు, చేతులకు వేళ్లు, గొంతు అతుక్కొని ఉన్నవారికి ప్లాస్టిక్‌ సర్జరీలు నిర్వహించడానికి ఈ శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. అంగలి చీలిక, క్రానియో ఫేషియల్‌, అనోమాలిస్‌, పుట్టుకతో వచ్చే చేతి వైకల్యాలు, ప్రసూతి బ్రాచిలర్‌ ప్లేసెస్‌, గాయం పోస్ట్‌, బర్న్‌ పోస్ట్‌, ట్రామా వైకల్యాలు, వాస్క్యులర్‌ అనోమాలిస్‌ 12, 14 ఏళ్ల వయసు గల పిల్లలను ప్రభావితం చేసే ఇతర వైకల్యాల గురించి ఈ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 18వ తేదీలోపు స్క్రీనింగ్‌ పరీక్షలకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని వారు సూచించారు. స్క్రీనింగ్‌ పరీక్షల అనంతరం 20వ తేదీ నుంచి పది రోజులపాటు ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరంలో ప్రముఖ వైద్యులు భవానీ ప్రసాద్‌, సుదర్శన్‌రెడ్డి ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. వివరాలకు 9908630301, 9848241640 లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement