ఇంట్లో చోరీ
పట్నంబజారు(గుంటూరుఈస్ట్): ఇంటిలో చోరీపై కేసు నమోదైంది. కొత్తపేట పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట శనక్కాయల ఫ్యాక్టరీ సెంటర్‌లో నివాసం ఉండే తోకల రవి కార్పొరేషన్ పరిధిలోని సచివాలయం నంబరు– 4లో టౌన్ ప్లానింగ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య దేవరకొండ వెంకటశివమ్మ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఇద్దరూ అత్తమామలైన దేవరకొండ వెంకటరమణ, రామతులసమ్మ ఇంటిలో ఉంటున్నారు. ఈనెల 12 రాత్రి ఎప్పటిలాగే భోజనం చేసి అందరూ నిద్రించారు. వెంకటరమణకు వాష్‌రూంకు వెళ్లే అలవాటు అధికంగా ఉండటంతో కింద పోర్షన్‌లో నివాసం ఉండే ఆయన భార్య రామతులసమ్మ తలుపులు తీసి నిద్రించారు. 13వ తేదీ ఉదయం లేచి చూసేసరికి బీరువా తలుపులు తీసి ఉండటం గమనించారు. అందులోని 379 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించుకు పోయారు.తోకల రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. తలుపులు తీసి ఉండటం, పక్కనే రైల్వే ట్రాక్ ఆనుకొని ఉండటంతో చోరీకి పాల్పడిన ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. తెలిసిన వారే చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment